Ramu Rathod : ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఒక్క ఫోక్ సాంగ్ ‘రాను బొంబాయికి రాను పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ సాంగ్ దెబ్బకు మనోడు ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో కూడా కంటెస్టెంట్ గా చేస్తున్నాడు. తన ఆటతో బాగానే ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా రాము రాథోడ్ పేరెంట్స్ రాము గురించి మాట్లాడారు. మా కొడుకు రాము అంటే మా కుటుంబంలో చాలా ఇష్టం. మేం ఎవరూ పెద్దగా చదువుకోలేదు. కానీ రాము చదువుకుంటే ఇన్ని రోజులు సంతోషించాం. టీవీల్లో అలా చూడలేకపోతున్నాం. ఒకరినొకరు అలా తిట్టుకోవడం మాకు అస్సలు నచ్చట్లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాము వాళ్ల నాన్న. కానీ అదంతా గేమ్ లో భాగం అని తమకు తెలియదంటున్నారు రాము పేరెంట్స్.
Read Also : Maremma : రవితేజ ఇంటి నుంచి మరో హీరో.. గ్లింప్స్ చూశారా..
రాము అందరితో కలిసిపోతాడు.. అందరినీ సరదాగా పలకరిస్తూ ఉంటాడు. కానీ అతన్ని తిట్టడం మాకు నచ్చట్లేదు. అతను కచ్చితంగా కప్ గెలుచుకుని బయటకు రావాలి అంటూ తెలిపారు రాము పేరెంట్స్. రాము రాథోడ్ ఇప్పుడు బిగ్ బాస్ లో తన ఆటతో బాగానే దూసుకుపోతున్నాడు. మొదటి వారం అందరితో కలివిడగా కనిపించాడు. కానీ ఎక్కడా నెగెటివిటీ చూపించట్లేదు. తనూజ గౌడ మీద పాడిన పాట బాగా వైరల్ అయింది. రాము రాథోడ్ పాటలు పాడటం, రాయడం, డ్యాన్స్ తో అదరగొడుతుంటాడు. ఆయన ఎన్నో ఫోక్ సాంగ్స్ స్వయంగా రాసి పాడాడు. అందులో రాను బొంబాయికి రాను పాట బాగా పాపులర్ అయింది. ఆ పాటకు 500 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సినిమా పాటలకు కూడా సాధ్యం కాని విధంగా ఈ పాట భారీ వ్యూస్ సాధించింది.
Read Also : Deepika Padukone : మగాడిలా ఉన్నావన్నారు.. దీపిక ఎమోషనల్..