Rambha: సీనియర్ నటి రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అచ్చ తెలుగు హీరోయిన్స్ లో రంభ ఒకరు. ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన రంభ.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అప్పట్లో రంభ హాట్ బ్యూటీ. గ్లామర్ హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మలేషియాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ ను పెళ్ళాడి.. విదేశాలకు వెళ్ళిపోయింది. పెళ్లి తరువాత డ్యాన్స్ షోస్ కు జడ్జిగా, కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మెప్పించింది. ఇక ఈ మధ్య సీనియర్ హీరోయిన్లందరూ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రంభ కూడా రీఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో రంభ, రజినీకాంత్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారింది.
” నేను రజినీకాంత్ గారితో అరుణాచలం సినిమాలో నటించాను. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బంధన్ అనే సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. మధ్యాహ్నం వరకు అరుణాచలం.. నైట్ వరకు బంధన్ షూట్ లో పాల్గొనేదాన్ని. రెండు పక్కపక్కనే జరుగుతుండడంతో పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు. ఇక ఒకసారి సల్మాన్.. అరుణాచలం సెట్స్ కు వచ్చాడు. ఆయనను చూడగానే వెంటనే నేను వెళ్లి హాగ్ చేసుకొని పలకరించాను. దాన్ని రజినీ సర్ చూసారు. వెంటనే రజినీ సర్.. డైరెక్టర్ సుందర్ సి తో ఏదో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తరువాత రజినీ సర్.. వచ్చి టవల్ విసిరికొట్టి నాతో ఆగ్రహంతో మాట్లాడారు. అప్పుడు సుందర్ సి నా వైపు కంగారుగా చూశారు.. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కాలేదు. అక్కడ అదంతా చూస్తున్న కెమెరా మ్యాన్ వచ్చి.. మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది, రజినీ సర్.. మీతో కలిసి పనిచేయను అని అంటున్నారు అని అన్నాడు. ఇక నేను ఏడవడం మొదలుపెట్టాను. అప్పుడు రజినీ సర్ వచ్చి.. ఎవరు ఈ అమ్మాయిని ఏడిపించింది అని మండిపడ్డారు. అసలు ఏం జరిగింది.. నేనేం తప్పు చేశాను అని అడిగితే.. ఉదయం సల్మాన్ ను హాగ్ చేసుకున్నది ప్రాక్టికల్ గా చూపించి.. బాలీవుడ్ హీరో అయితే హాగ్ చేసుకుంటావ్.. మాకు అయితే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతావ్ అని ఆట పట్టించారు. ఇదంతా సెట్ లో అందరికి ముందే తెలుసు. అలా నన్ను ఆటపట్టించారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.