Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్‌కూ గ్రీన్ సిగ్నల్!

Ramayana Bollywoood

Ramayana Bollywoood

Ramayana Trailer: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోను రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌కు తాజాగా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ లభించగా, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘రామాయణ’ ట్రైలర్‌ను రెండు వేర్వేరు వెర్షన్లలో సర్టిఫై చేసిందట.

థియేటర్లలో ప్రదర్శించేందుకు 4 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌కు అనుమతి ఇవ్వగా, సోషల్ మీడియా వేదికల కోసం 4 నిమిషాల 15 సెకన్ల ప్రత్యేక వెర్షన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ ట్రైలర్‌ను జూలై 24న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విజువల్ ఎపిక్‌కు సంబంధించిన పూర్తి స్థాయి గ్లింప్స్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, సినిమాకు సంబంధించిన 34 నిమిషాల స్పెషల్ ఫుటేజ్‌కు ఆస్ట్రేలియన్ క్లాసిఫికేషన్ బోర్డు ‘M’ రేటింగ్ జారీ చేసిందట. ఈ ఫుటేజ్‌ను ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్ల కోసం ప్రత్యేక ప్రదర్శనలలో ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 34 సెకన్ల నిడివి ఉన్న మరో ప్రచార వీడియోకు బ్రిటన్‌కు చెందిన BBFC (British Board of Film Classification) కూడా థియేటర్లలో ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చిందని సమాచారం. ట్రైలర్‌కు వరుసగా అంతర్జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్లు లభిస్తుండటంతో ‘రామాయణ’పై అంచనాలు ట్రేడ్ వర్గాల్లో మరింత పెరిగాయి.