Prabhas: రోజురోజుకు టాలీవుడ్ తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తోంది. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకొని మిగతా ఇండస్ట్రీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మాట విదితమే. ముఖ్యంగా బాలీవుడ్ పై విజయం సాధించి టాలీవుడ్ విజయకేతనం ఎగురవేసింది. దీంతో టాలీవుడ్ పై బాలీవుడ్ గుర్రుగా ఉన్న మాట వాస్తవమే. అయితే ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ను తొక్కేయడానికి బాలీవుడ్ కుట్రలు పన్నుతున్నదని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు అస్త్రంగా ప్రభాస్ ను వాడుకుంటున్నారని, ప్రభాస్ పై బావు లో కొందరు కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఆదిపురుష్ టీజర్ పై ట్రోల్స్ రావడానికి కూడా వారే కారణమని, కావాలనే ఒక ముంబై ఏజెన్సీ మీమర్స్ కు, ట్రోలర్స్ కు డబ్బులు ఇచ్చి ట్రోల్ చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఆరోపణలపై వివాసాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
“దీనికన్నా పెద్ద జోకు నా జీవితంలో వినలేదు. బాలీవుడ్ అనేది ఒక మీడియా క్రియేటెడ్ లేబుల్.. అయితే అసలు నిజం ఏంటంటే అక్కడ ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు. ఒక బిజినెస్ మ్యాన్ గా అతడేమి ఆలోచిస్తాడు.. ఒక స్టార్ హీరోను.. అంతకుముందు బాహుబలి సినిమాతో విజయం అందుకున్న ప్రభాస్ ను తీసుకొని ఒక సినిమా తీయాలనుకుంటాడు. అతడికి మిగాతా ఇండస్ట్రీకి సంబంధం ఉండదు. టాలీవుడ్ లో దిల్ రాజు అనే నిర్మాత ఉన్నాడు.. సుబ్బరాజు అనే మరో నిర్మాత ఉండొచ్చు.. వారిద్దరూ కలిస్తేనే టాలీవుడ్ అవ్వదు కదా.. ఫైనల్ గా ఒక నిర్మాత వాడికెంత డబ్బు వస్తుంది అని చూసుకుంటాడు కానీ, ఎవ్వడినో తొక్కేద్దాం, ఎక్కిద్దాం అనే కాంటెక్స్ట్ అస్సలు వర్క్ అవుట్ అవ్వదు. అందుకు ఒక ఉదాహరణ.. బాలసుబ్రమణ్యం గారు మైనే ప్యార్ కియా(ప్రేమ పావురాలు) సినిమాలో పాట పాడారు. అప్పట్లో ఆయన తెలుగు సింగర్.. అయితే ఆ డైరెక్టర్ ఏం ఆలోచించాడు. ఈయనతో పాట పాటిస్తే మ్యూజిక్ వర్క్ అవుట్ అవుతోంది అని అనుకున్నాడు. ఆ మ్యూజిక్ తో ఆయనకు డబ్బులు వస్తున్నాయి. అందుకే పాడించాడు. అంతేకానీ బాలసుబ్రమణ్యం గారిని తెలుగు నుంచి హిందీకి తీసుకెళ్లి ఎక్కించేద్దామని కాదు. డబ్బు చేసుకుంటున్నారు కాబట్టి చేస్తున్నారు.. వారందరికీ డబ్బు సంపాదించడమే ఇంట్రెస్ట్. అలాగే ఇప్పుడు ప్రభాస్.. ప్రభాస్ అనే ఒక యాక్టర్ ఎంత మనీ జనరేట్ చేస్తున్నాడు అనేదే వారికి ఇంట్రెస్ట్.. కానీ ఎవడో సౌత్ నుంచి వచ్చి వాడిని తొక్కేస్తున్నాడు అనేది మీడియా ఇన్వెస్ట్ పాయింట్.. నేను దానికి అసలు అంగీకరించడం లేదు.
ఇక ప్రభాస్ ను తొక్కేయ్యడానికి మీమ్స్, ట్రోలర్స్ కు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్లకేం పని. వాళ్లకేం ఉపయోగం అలా చేయడం వలన.. సరే ఆదిపురుష్ విషయానికొద్దాం.. ప్రభాస్ తప్ప మిగిలినవారందరూ బాలీవుడ్ వాళ్లే.. ఆ డైరెక్టర్ ఏం ఆలోచిస్తాడు. నేను ఇండియాలోకెల్లా పెద్ద డైరెక్టర్ కావాలని ఆశిస్తాడు. తాను చేసిన సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పుకోవాలని చూస్తాడు. ప్రభాస్ ను పెట్టి రాజమౌళి కన్నా పెద్ద హిట్ ను తీద్దామని కోరుకుంటాడు కానీ, నా పేరును త్యాగం చేసి ప్లాప్ తీద్దాం..ఎందుకంటే బాలీవుడ్ ప్రతిష్ట కోసం నా కెరీర్ త్యాగం చేయాలని ఎవడైనా అనుకుంటాడా..? ఇవన్నీ మీరు అనుకుంటున్నారు కానీ అవన్నీ ఏమి లేవు”అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.