తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై కొత్త రోజులుగా పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలో లేకున్నప్పటికీ…పీసీసీ పదవిపై చాలా మంది ఆశ పడ్డారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా పీసీసీ కోసం ఎగబడ్డారు. ఎవరికి వారు… తమ పంతాన్ని నెగ్గించుకునే పనిలో పడ్డారు. అయితే తెలంగాణ పీసీసీ చీఫ్ పై కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు నిన్న ఏఐసీసీ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే… దీనిపై సొంత పార్టీ నేతలు కొంత మంది గుర్రుగా ఉన్నప్పటికీ… చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… తెలంగాణ పీసీసీగా రేవంత్ రెడ్డిని నియమించడంపై సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో స్పందించారు.
read also : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
ఎప్పుడు రాజకీయ పార్టీలపై ఫోకస్ పెట్టే వర్మ… తాజాగా రేవంత్ రెడ్డిని పోగుడుతూ ఓ ట్వీట్ చేశాడు. “రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియామకం చేసి.. కాంగ్రెస్ అధిష్టానం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు పులులన్నీ.. రేవంత్ రెడ్డి అనే సింహానికి భయపడతాయి. రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించి… రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు చాలా గొప్ప పని చేశారు” అంటూ ట్వీట్ చేశారు వర్మ. కాగా.. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించడంపై కాంగ్రెస్ నేత కేఎల్‌ఆర్ నిన్న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Finally Congress Party took one SUPER FANTASTIC DECISION by making LION REVANTH RÊDDY the PRESIDENT ..ALL THE TIGERS WILL NOW BE SCARED OF THE LION @revanth_anumula
— Ram Gopal Varma (@RGVzoomin) June 26, 2021