Ram Charan’s The India House Casting Call: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా సత్తా చాటుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నడుపుతున్న ఆయన తన స్నేహితుడు విక్రమ్ తో కలిసి V మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించారు. ఇక ఆ బ్యానర్ లో మొదటి సినిమాని టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నిఖిల్ తో ప్లాన్ చేసి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ చేస్తూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో మంచి అంచనాలు క్రియేట్ కూడా చేసింది. ‘ఇండియన్ హౌస్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఆసక్తికరమైన ప్రకటన వచ్చింది. బ్రిటిష్ రూలింగ్ సమయంలో ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది.. బ్రిటిష్ గడ్డ పై ఏర్పాటు చేసిన గూఢచారి సమావేశం గృహమే ఈ ‘ఇండియన్ హౌస్’.
Srisailam: శ్రీశైలంలో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు శ్రావణ మాసోత్సవాలు
ఇక ఇప్పుడు రామ్ చరణ్ V మెగా పిక్చర్స్ బ్యానర్ పెట్టి కొత్త టాలెంట్ ని ప్రోత్సహించి ఇండస్ట్రీకి వద్దామనుకుంటున్న కొత్తవారికి తాను అవకాశం కలిపిద్దాం అని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ ఈ సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ ఒక ఆడిషన్ నోటీసు రిలీజ్ చేశారు. 10 ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఉన్న నటీనటులు కావాలని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 3 ఫోటోలు మరియు ఒక నిమిషం పాటు నటించిన వీడియో casting@agarwalarts.com కి పంపించాలని ప్రకటించారు. నిమిషం వీడియో అంటే రీల్స్ కాకుండా తమ టాలెంట్ చూపించేలా ఉండాలని నోట్ కూడా పెట్టారు, మరి మీకు నటన మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.
Calling out all the actors to be a part of #TheIndiaHouse 🇮🇳
Send your profiles to casting@agarwalarts.com
Come, be a part of the revolution 🔥#JaiMataDi #RevolutionIsBrewing #ThisIsYoungIndia@actor_Nikhil @AlwaysRamCharan @AnupamPKher @ramvamsikrishna @AbhishekOfficl… pic.twitter.com/KYqZxqiTqE
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) July 28, 2023