RC 16: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్ ఆ రేంజులోనే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. ఈ స్టార్ హీరోలు చేస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గ్లోబల్ టచ్‌తో రాబోతున్నాయి. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉండగానే.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టాడు చరణ్. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సెట్స్ పై ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం ఖాయం. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా అనౌన్స్ చేశాడు చరణ్. ఈ ప్రాజెక్ట్ రంగస్థలం సినిమాకు మించి, గ్లోబల్ రేంజ్‌లో ఉంటుందని.. ఇప్పటికే చెప్పేశాడు రామ్ చరణ్. అందుకే బుచ్చిబాబు ట్రిపుల్ ఆర్ లెవల్లో ఆర్సీ 16 కోసం రంగం సిద్దం చేస్తున్నాడట. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం వివిధ భాషలకు చెందిన యాక్టర్స్‌ను తీసుకున్నాడు రాజమౌళి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఆలియా భట్.. కోలీవుడ్ నుంచి సముద్రఖని, శ్రియ శరన్.. ఇలా వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకున్నాడు.
బడ్జట్ అండ్ కాస్టింగ్ స్కేల్ కి తగ్గట్టే.. ఆర్ ఆర్ ఆర్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ని షేక్ చేసి.. హాలీవుడ్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకొని.. ఏకంగా ఆస్కార్ కొట్టేసింది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు కూడా.. హిందీ, తమిళ, మలయాళ నటీనటులతో పాటు కొంతమంది మరాఠీ థియేటర్, టీవీ ఆర్టిస్టులను కూడా ఆర్సీ 16లో తీసుకుంటున్నారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం స్టార్ కాస్టింగ్ సెలక్షన్ జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఆర్సీ 16 నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను బయటికి రానున్నాయి. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ మూవీలో నటిస్తోంది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.
Also Read
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!