RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!

Rc17 (2)

Rc17 (2)

RC17 – Rukmini Vasanth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం #RC17. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా కాంతర సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇప్పటికే ఆమెను చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అంతేకాదు ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. కథలో ఆ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు సంగీత దర్శకుడి విషయంలో కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలవనుంది. ఇప్పటి వరకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈసారి మాత్రం ఆ సెంటిమెంట్‌కు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘ధురంధర్’ ఫేమ్ శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని పెంచుతోంది.