RamCharan : రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు. మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. నిన్న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఇందులో రామ్ చరణ్ రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. పైగా చేతిలో చుట్ట పట్టుకుని ఉన్నాడు. దీంతో మూవీ రంగస్థలంను మించి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కూడా పూర్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతం స్లాంగ్ ను ఈ సినిమాలో రామ్ చరణ్ మాట్లాడుతాడంట. పూర్తిగా అక్కడి స్లాంగ్ తోనే ఈ సినిమా తీస్తున్నట్టు సమాచారం. గతంలో రంగస్థలం సినిమా కూడా అంతే.
Read Also : L2: Empuraan: మోహన్ లాల్ ‘ఎంపురాన్’’తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం..
ఆ సినిమాను కూడా పూర్తిగా ఉత్తరాంధ్ర స్లాంగ్ తోనే తీశారు. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. చరణ్ కెరీర్ ను ఆ మూవీ మరో స్థాయిలో నిలబెట్టింది. ఇప్పుడు బుచ్చిబాబు తీస్తున్న సినిమాలో కూడా సేమ్ ఉత్తరాంధ్ర స్లాంగ్ సెంటిమెంట్ ను వాడేస్తున్నారంట. ఈ దెబ్బతో మరోసారి రంగస్థలంకు మించి హిట్ కొడుతామని మూవీ టీమ్ చెబుతోంది. ఉగాది రోజున గ్లింప్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి పుట్టిన రోజున గ్లింప్స్ విడుదల చేయాలని చూశారు. కానీ మిక్సింగ్ పూర్తి కాక ఉగాదికి రిలీజ్ డేట్ ను పెట్టుకున్నారు. ఇక గ్లింప్స్ వచ్చిన తర్వాత మూవీపై మరింత హైప్ పెరగడం ఖాయం అంటున్నారు.