Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి సినిమా తర్వాత పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మూవీ ఇది. దీని కోసం రామ్ చరణ్ తన లుక్ ను కూడా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన లుక్ ను చూస్తుంటే రంగస్థలంలో రామ్ చరణ్ లాగా కనిపిస్తున్నాడు. గడ్డం, మీసాలతో ఊర మాస్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పావు వంతు షూటింట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.
Read Also : DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన దొంగ..
ఇక తాజాగా రామ్ చరణ్ బేగం పేట్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. వైట్ కలర్ షర్టు, జీన్ ప్యాంట్ వేసుకున్నాడు. గాగుల్స్ పెట్టుకుని చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాస్, స్టైల్ కలిపితే ఇలాగే ఉంటుందంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. రామ్ చరణ్ ఎక్కడకు వెళ్తున్నాడనేది తెలియరాలేదు. కానీ మూవీ షూటింగ్ కోసమే వెళ్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ మరో సినిమాను లైన్ లో పెట్టే పనుల్లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.