Ram Charan: టైటిల్ చూసి.. ఏదేదో ఉహించుకోకండి.. రామ్ చరణ్ ఎన్నికల ప్రచారం చేయడం నిజమే.. కానీ అది బయట కాదు సినిమాలో. ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. RC15 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి చరణ్ కు జోడిగా అంజలి నటిస్తుండగా కొడుకు చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలను బట్టి చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో సీఎం గా కనిపించనున్నాడట. అభ్యుదయం అనే పార్టీలో సీఎం గా మారి ప్రజలకు సేవ చేసే పాత్రలో చరణ్ కనిపించనున్నాడట.. ఇక సీఎం కావడానికి ప్రచారం జరుగుతున్న సీన్స్ ను శంకర్ షూట్ చేస్తున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియో లీక్ అయ్యి ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెద్ద సినిమాలను లీకుల నుంచి ఎవరు కాపాడలేకపోతున్నారు.
ఇక చరణ్ ప్రచారం కోసం సభలతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ గురించి చెప్పనున్న సీన్స్ చాలా కీలకమని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చరణ్ సీన్స్ ను అభిమానులు జనసేనకు అన్వయించుకుంటున్నారు. పవన్ ప్రచారంలో చరణ్ కూడా ఇలాగే చేస్తే బావుంటుందని చెప్పుకొస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు చరణ్ సైతం ప్రచారం పాల్గొన్నాడు. ఇప్పుడు బాబాయ్ కోసం ప్రచారంలో పాల్గొంటే బావుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి చరణ్, బాబాయ్ కోసం రంగంలోకి దిగుతాడా..? లేదా..? చూడాలి.