ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ అయినంత ఎగ్జైట్మెంట్ ఇంకెవరు కాలేదు. ఇక శంకర్ షూటింగ్ స్పీడ్ చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఊహించని విధంగా మధ్యలోకి ఇండియన్2 ఎంట్రీ ఇవ్వడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. విక్రమ్ హిట్‌తో.. ఆగిపోయిన ‘ఇండియన్2’ జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు కమల్. ప్రస్తుతం గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 సినిమాలు ఈక్వల్‌గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. కానీ గేమ్ ఛేంజర్ అనుకున్న దానికంటే మరింత డిలే అయింది. వాస్తవానికైతే.. ఈ ఏడాదిలోనే సినిమా రిలీజ్ ఉంటుందని అనుకున్నారు. పోని వచ్చే సంక్రాంతికి లేదంటే సమ్మర్లో అయిన రిలీజ్ అవుతుందని అనుకున్నారు. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం గేమ్ ఛేంజర్ మరింత వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది.
ముందుగా వచ్చే సంక్రాంతికి ఇండియన్ 2 రిలీజ్ చేస్తారని వినిపించింది కాబట్టి సమ్మర్లో గేమ్ ఛేంజర్ రావడం పక్కా అనుకున్నారు కానీ ఇప్పుడు ఇండియన్ 2 సినిమానే సమ్మర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ‘మామన్నన్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో ఉదయనిధి స్టాలిన్ ఇండియన్ 2 రిలీజ్ అప్డేట్ ఇచ్చాడు. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో ఇండియన్ 2 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ఉదయనిధి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు, అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చాడని అంటున్నారు. అదే జరిగితే సమ్మర్‌లో కూడా గేమ్ ఛేంజర్ రిలీజ్ అవడం కష్టమే. ఎందుకంటే శంకర్ నుంచి రెండు సినిమాలు ఒకేసారి థియేటర్లోకి రావడం ఇంపాజిబుల్ కాబట్టి 2024 దసరాకే చరణ్ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి గేమ్ ఛేంజర్ రిలీజ్ పై నిర్మాత దిల్ రాజు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.