Chiranjeevi : చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రామ్ చరణ్ పెద్ది నుంచి మొన్న వచ్చిన చికిరి సాంగ్ పెద్ద హిట్ అయింది. దీని తర్వాత అప్పుడే రెండో సాంగ్ ను డిసెంబర్ 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. కానీ అప్పుడే వద్దని రామ్ చరణ్ పెద్ది టీమ్ కు చెప్పేశాడంట.
Read Also : Rajamouli : రాజమౌళిని చూసి మిగతా డైరెక్టర్లు నేర్చుకోండయ్యా..
ఎందుకంటే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మూవీ రాబోతోంది. మన శంకర వర ప్రసాద్ మూవీ సాంగ్ ను ఆ రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి తండ్రి చిరంజీవి మూవీని డిస్టర్బ్ చేసినట్టు ఉండొద్దని.. డిసెంబర్ మేనియా మొత్తం చిరంజీవిదే ఉండాలని చిరు భావిస్తున్నాడు. అందుకే సంక్రాంతి తర్వాతనే తన మూవీ అప్డేట్లు ఇవ్వాలని బుచ్చిబాబుకు చెప్పాడంట. చిరు మూవీకి ఎలాగూ అనిల్ రావిపూడి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తాడు. కాబట్టి ఆ గ్యాప్ మొత్తాన్ని చిరు సినిమాకే ఇవ్వాలని అంటున్నారు.
Read Also : Tamannah : అలాంటి ఇంజెక్షన్లు వాడుతున్న తమన్నా..? అసలు నిజం ఇదే..!