ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. పూర్తిస్థాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ సన్నిహితుడైన సతీష్ కిలారు, ‘వృద్ధి సినిమా’ పేరుతో బ్యానర్ లాంచ్ చేసి నిర్మాతగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ వాయిదా పడుతున్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా టీం ఆసక్తికరంగా ఆ ప్రచారాన్ని ఖండించింది.
Also Read:Bheems Ceciroleo: మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు.. ముంబాయిలో కూడా తెలియాలి!
రామ్ చరణ్ తేజ జిమ్‌లో ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించగా, సినిమాని 27వ తేదీ మార్చి, 2027న రిలీజ్ చేస్తున్నట్లు మరోసారి ప్రకటించారు. తదుపరి నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్లుగా ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ ఫోటోలలో రామ్ చరణ్ అప్పర్ బాడీ కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చారు. తన ఫిజిక్ మొత్తం కనిపించేలా రామ్ చరణ్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇతర కీలక పాత్రలలో టాలీవుడ్ సహా ఇతర భాషలకు చెందిన సీనియర్ నటులు కనిపించబోతున్నారు. మొత్తం మీద రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వాయిదా లేదని క్లారిటీ రావడంతో, త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది.