మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తన క్లోజ్ ఫ్రెండ్ అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వస్తాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ వార్తని అబద్ధం చేస్తూ వరంగల్ లో జరిగిన ఏజెంట్ ప్రీ ఈవెంట్ కి రామ్ చరణ్ రాలేదు. కింగ్ నాగ్ చీఫ్ గెస్టుగా వచ్చి అక్కినేని ఫాన్స్ కి ఖుషి చేశారు. చరణ్, అఖిల్ లని ఒకే స్టేజ్ పైన చూడాలి అనుకున్న మ్యూచువల్ ఫాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. అయితే ఏజెంట్ మేకర్స్ రామ్ చరణ్ కోసం వేరే ప్లాన్ వేసినట్లు ఉన్నారు. “థింగ్స్ ఆరే గెత్తింగ్ వైల్డర్… ధృవ X ఏజెంట్ స్టే ట్యూన్డ్” అంటూ స్వీట్ షాక్ ని ఇచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ లో రామ్ చరణ్ ఫేస్ రివీల్ చెయ్యకుండా “ఏజెంట్ ఎక్కడ ఉన్నావ్” అని వాయిస్ ని మాత్రమే వినిపించారు. దృవ సినిమా గెటప్ లో చరణ్ వైట్ షర్ట్ వేసుకోని ఉన్న ఈ వీడియో మెగా-అక్కినేని కామన్ ఫాన్స్ ని ఫుల్ జోష్ లోకి తెచ్చింది. ఇది కదా మాకు కావాల్సిన ఎమోషన్, ఇలాంటి అప్డేట్ పెట్టుకోని ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటూ రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
కొంతమంది ఏమో రామ్ చరణ్, ఏజెంట్ సినిమాలో ఒక పాత్రలో నటించినట్లు ఉన్నాడు. క్యామియోగా కనిపిస్తాడు అందుకే మేకర్స్ ఈ వీడియోని రిలీజ్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసిన వీడియో చరణ్ క్యామియోకి సంబందించినది కాదు. ఏజెంట్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది, అంతక ముందు ప్రమోషనల్ ఈవెంట్ కోసం అఖిల్ ఆంధ్రప్రదేశ్ వెళ్లాడు కానీ హైదరాబాద్ లో ప్రెస్ మీట్స్ తప్ప ఈవెంట్స్ చెయ్యలేదు. ఇందుకోసమే రిలీజ్ కి ముందు ఏజెంట్ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ ని హైదరాబాద్ లో చేసి, దాని కోసం రామ్ చరణ్ ని రంగంలోకి దించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫుల్ డీటైల్స్ తెలియాల్సి ఉంది. ఏప్రిల్ 28న ఏజెంట్ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈరోజు, రేపటి లోపే రామ్ చరణ్, అఖిల్ కలిసి కనిపించే ఛాన్స్ ఉంది.
Things are getting wilder! #DHRUVA x #AGENT ⏳
Stay Tuned…#AGENTonApril28th pic.twitter.com/wTGLYFWo3O
— AK Entertainments (@AKentsOfficial) April 26, 2023