Rakul Preet : ఈ మధ్య సెలబ్రిటీల పేర్లతో మోసాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్లు, హీరోల పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. రీసెంట్ గానే అదితిరావు హైదరీ పేరుతో ఇలాంటి ఫేక్ ఐడీని క్రియేట్ చేయగా.. ఆమె వెంటనే అలెర్ట్ అయి బయట పెట్టేసింది. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఇలాంటి ఫేక్ ఐడీని క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తన పేరుతో ఎవరో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసినట్టు తెలిపింది.
Read Also : I Bomma Ravi : చంచల్ గూడ జైలుకు ఐ బొమ్మ రవి
ఆ స్క్రీన్ షాట్ ను కూడా పంచుకుంది. ‘ఎవరో ఒకరు నా పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసినట్టు నా దృష్టికి వచ్చింది. ఆ అకౌంట్ నుంచి చాలా మందికి మెసేజ్ లు పంపి మోసం చేయాలని చూస్తున్నారు. అది నా అకౌంట్ కాదు. దీన్ని అందరూ గుర్తించి మీకు ఆ నెంబర్ నుంచి మెసేజ్ వస్తే బ్లాక్ చేయండి’ అంటూ కోరింది రకుల్ ప్రీత్ సింగ్. ఆమె చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అవుతోంది. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే కదా.
Read Also : Draupathi 2 : ‘ద్రౌపది 2’ నుంచి రక్షణ ఫస్ట్ లుక్ రిలీజ్