Rakul Preet Singh Shares Her Bad Experiences In Career Starting Days: ఏదైనా ఒక సినిమాలో ఓ హీరోయిన్‌ని కన్ఫమ్ చేసిన తర్వాత.. దాదాపు ఆమెతోనే సినిమా చేస్తారు. ఒకవేళ హీరోయిన్లు ఏమైనా ఇబ్బందిపెడితే తప్ప, వాళ్లను ప్రాజెక్టులో నుంచి తీసెయ్యరు. పరిమితికి మించి ఎక్కువ టార్చర్ పెడితే.. ఉన్నపళంగా ఆమెని తొలగించి, మరో కథానాయికని రంగంలోకి దింపుతుంటారు. కానీ.. తన విషయంలో మాత్రం మరీ దారుణంగా వ్యవహరించారంటూ రకుల్ ప్రీత్ సింగ్ వాపోయింది. తాను చాలా డెడికేటెడ్‌గా పని చేసినప్పటికీ.. అన్యాయంగా తనని సినిమాల్లోంచి తొలగించి, మరొకరిని తీసుకున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే.. ఈ అవమానాలు ఎదురైంది స్టార్ హీరోయిన్ అయ్యాక కాదు, కెరీర్ ప్రారంభంలో!
Man Chops Private Part: వీడెవడండీ.. పెళ్లాం రావడం లేదని దాన్నే కోసేసుకున్నాడు..
తాను లేటెస్ట్‌గా నటించిన ‘ఛత్రీవాలీ’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. కెరీర ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. ‘‘నాకు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. నేను ముంబైలో కాండీవాలీలో ఉండేదాన్ని. కానీ.. నా ట్రైనర్‌తో కలిసి బాంద్రాలోని ఒక కేఫ్‌లో కూర్చునేదాన్ని. అక్కడ ఏయే ఆఫీస్‌కి వెళ్లాలి? ఎన్ని ఆడిషన్స్ ఇవ్వాలి? అని ప్రణాళికలు వేసుకునేదాన్ని. బాంద్రా, అంధేరీల్లో ఆడిషన్స్ ఉంటే, ఆ కేఫ్ నుంచే నేరుగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో ఆ కేఫ్‌కి వెళ్లేదాన్ని. అప్పుడు నా దగ్గర కొన్ని దుస్తులే ఉండేవి. కారులోనే దుస్తుల్ని మార్చుకునే పరిస్థితులవి. ఆ రోజుల్లో నాకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారేవి. కొన్నిసార్లైతే.. నాతో షూటింగ్ చేసి, ఆ తర్వాత నన్ను తొలగించి, మరో హీరోయిన్‌ని తీసుకునేవారు. అప్పుడు నాకు బాధగా అనిపించినా, ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేశారు. ఇప్పుడు ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను’’ అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.
INDvsNZ ODI: కదంతొక్కిన భారత బౌలర్లు.. న్యూజిలాండ్ 108 ఆలౌట్
కాగా.. తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన రకుల్, అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. చాలామంది స్టార్ల సరసన నటించింది. కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్‌ని ఏలింది. అయితే.. ఇంతలో కొత్త భామల నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యేసరికి రకుల్‌కి క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. తమిళంలో ఇండియన్ 2, అయలాన్ సినిమాల్లో నటిస్తోంది. హిందీలో అరకొర ఆఫర్లతో నెట్టుకొస్తుంది.
Ap Police Constable Exam: రేపే ఏపీలో కానిస్టేబుల్ రాతపరీక్ష.. అభ్యర్థులకు కొన్ని సూచనలు