Comedian Sudhakar: టాలీవుడ్ టాప్ కమెడియన్స్ లిస్ట్ తీస్తే టాప్ 10 లో సుధాకర్ పేరు ఉంటుంది. అప్పట్లో సుధాకర్ లేని సినిమా ఉండేది కాదు అంటే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిర్మాతలు స్టార్ హీరోస్ డేట్స్ కోసం ఎంతగా ఎదురుచూసేవారో.. సుధాకర్ డేట్స్ కోసం కూడా అంతగా ఎదురుచూసేవారట. చిరంజీవి దగ్గరనుంచి మహేష్ బాబు వరకు స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన కమెడియన్ సుధాకర్. ప్రస్తుతం ఆయన వయస్సు 64. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సుధాకర్ సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఆయన చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే .. తాను బతికేవున్నాను అని, దయచేసి చంపవద్దని ఆయన బతిమిలాడిన తీరు కంటతడి పెట్టించింది. ఇక తాజాగా సుధాకర్.. ఎన్టీవీకి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల గురించి సుధాకర్ చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Rakesh Master Death: బిగ్ బ్రేకింగ్.. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, జగపతి బాబు లాంటి స్టార్ హీరోలతో పనిచేశారు కదా.. వారి గురించి చెప్పండి అన్న ప్రశ్నకు.. సుధాకర్ మాట్లాడుతూ.. “జగపతిబాబుకు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో.. ఏ డ్రెస్ బావుంటుందో చెప్తూ ఉండేవాడిని. ఆయన వాటిని ఖచ్చితంగా పాటించేవాడు. ఇక వెంకటేష్ అయితే కాల్ చేసి.. ఎక్కడ తింటున్నావ్ సుధాకర్.. ఏ ఫుడ్ తెచ్చుకున్నావు అంటూఅడిగేవారు. సెట్ లో కొద్దిసేపు నేను కనిపించకపోతే అందరు సుధాకర్ ఎక్కడ..? అని అడిగేవారు అని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవితో మీకు గొడవలు ఉన్నాయా అన్న ప్రశ్నకు.. సినిమాలో నటించకముందు మేము ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం.. ఆ తరువాత ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండేవాళ్ళం. అయితే మా మధ్య గొడవలు లేవు.. కనీసం చిన్న చిన్న గొడవలుకూడా రాలేదు.. కాంట్రవర్సీ ప్రశ్నలు అడగకండి” అంటూ చెప్పుకొచ్చాడు.