Coolie: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు చూశారు. వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన జైలర్ సినిమా ఆయనకు బిగ్ బ్రేక్ ఇచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిక బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, నిర్మాణ సంస్థకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో సన్ పిక్చర్స్, రజనీకాంత్‌తో వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. నిజానికి జైలర్ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ నటులు ప్రత్యేక పాత్రల్లో నటించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. అయితే, జైలర్ విజయం రజనీకాంత్‌ను ఒక రకమైన హ్యాంగోవర్‌లోకి నెట్టినట్లు కనిపిస్తోంది. రజనీకాంత్‌కు స్క్రిప్ట్‌లు వినిపించిన దర్శకులు ఈ విషయాన్ని గమనించారు. ఆయన తన పాత్రలో హీరోయిజం తక్కువగా ఉండి, ఇతర భాషల స్టార్ నటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించే సింపుల్ కథలే చేయాలని అనుకున్నారు.
Read Also : Payal Rajput : బాబోయ్.. పాయల్ ను ఇలా చూస్తే అంతే
ఆయన ఏమాత్రం తన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఈ నేపథ్యంలోనే యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ కోసం ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ కథ రజనీకాంత్ పాత్ర చుట్టూ తిరిగే విధంగా రాసుకున్నాడు. అయితే, రజనీకాంత్ ఆ స్క్రిప్ట్‌ను విని తిరస్కరించాడు. జైలర్ తరహాలో ఉండే కథను రూపొందించమని లోకేష్‌ను కోరారు. దీంతో, లోకేష్ కనగరాజ్ కూలీ స్క్రిప్ట్‌పై పని చేసి రజనీకాంత్ సూచనల మేరకు, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి నటులను సినిమాలో భాగం చేశారు. కానీ, ఈ పాత్రలు కథలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ మెమోన్ కూలీ సినిమా భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ, ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనే లభించింది. సినిమా హైప్ కారణంగా మొదటి వీకెండ్‌లో మంచి వసూళ్లు సాధించినప్పటికీ, లోకేష్ మొదట రూపొందించిన స్క్రిప్ట్‌ను రజనీకాంత్ ఆమోదించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే జైలర్ సక్సెస్ రజనీకాంత్‌ను ఒక ఫ్రేమ్‌లో బంధించినట్లు కనిపిస్తోంది. రజనీ అభిమాని అయిన లోకేష్ కనగరాజ్ ఆలోచనలను, క్రియేటివిటీ మొత్తాన్ని ఈ హ్యాంగోవర్ పాడు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినా అక్కడ మొహమాటం ఎంత పని చేస్తుందో ఇది ఓ ఉదాహరణ.