భారతీయ చిత్రసీమలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. భారతీయ సినిమా రంగానికి ఎనలేని సేవలు చేసినవారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు ప్రకటించిన ప్రతీసారి విమర్శలు కూడా అదే తీరున వినిపిస్తూ ఉంటాయి. 2019 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అందించారు. అక్టోబర్ 25న జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రజనీకాంత్ ఈ అవార్డును…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం అక్టోబర్ 25 తనకు చాలా ప్రత్యేకమని ప్రకటించారు. రేపు న్యూఢిల్లీలో ఆయన ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. అలాగే రజిని రెండవ కుమార్తె సౌందర్య విశగన్ రజనీకాంత్ వాయిస్‌తో ఒక కొత్త యాప్‌ను విడుదల చేయనున్నారు. అవార్డు ప్రదానోత్సవం కోసం రజనీకాంత్ రేపు న్యూఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తన జీవితంలో అక్టోబర్ 25 ప్రత్యేక రోజు అని వెల్లడించారు రజినీకాంత్. “రేపు (అక్టోబర్ 25) నాకు రెండు…
నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్‌గా చేసిన కృషికి గానూ సూపర్ స్టార్ రజినీకాంత్ 51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం ఆయనను “భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరు” అని వ్యాఖ్యానిస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ సైతం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రజినీకాంత్ ట్విట్టర్ లో ఒక లేఖను…