ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక్కో సూపర్ స్టార్ ఉంటాడు. ప్రతి ఇండస్ట్రీలో టైర్ 1, టైర్ 2 ని చాలా పెద్ద లిస్టే ఉంటుంది. అయితే అన్ని ఇండస్ట్రీలకి కలిపి, అన్ని ఇండస్ట్రీలు ఒప్పుకునే ఒకేఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్. షారుఖ్ ఖాన్ ని అడిగినా, మహేష్ బాబును అడిగినా, మోహన్ లాల్ ని అడిగినా ఇండియాకి ఒకడే సూపర్ స్టార్ ఉన్నాడు, అతని పేరు రజినీకాంత్ అని చెప్తారు. బస్ కండెక్టర్ దగ్గర నుంచి అభిమానులకి డెమి గాడ్ అయ్యే వరకూ రజినీకాంత్ జర్నీ ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. తెరలపై బొమ్మలు వేసే దగ్గర నుంచి, కలర్, 70MM, 3D, ఐమ్యాక్స్ వర్షన్, మోషన్ గ్రాఫిక్స్ … ఇలా సినిమా ఎన్ని రకాలుగా ఉందో అన్ని వెర్షన్స్ లో నటించాడు రజినీకాంత్. ఇన్నేళ్లుగా టాప్ చైర్ లో కూర్చున్న హీరో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా లేడు. అంతటి స్టార్ అయినా కూడా డౌన్ టు ఎర్త్ ఉండడం రజినీకాంత్ కి అలవాటు. ఈ విషయం రజినీని మరింత మంది అభిమానులకి దగ్గర చేసింది.
ఈరోజు ప్రతి హీరో రజినీకాంత్ తర్వాత నేనే అనుకుంటూ ఉంటాడు, రజినీ టైమ్ అయిపొయింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కామెంట్స్ వినిపించిన ప్రతిసారీ రజినీ ఒక హిట్ కొడతాడు. ఆ ఒక్క హిట్ ఎలా ఉంటుంది అంటే అప్పటివరకూ ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నీ చెల్లాచెదురు అయ్యేలా ఉంటుంది. రోబో 2.0 క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటివరకూ ఏ కోలీవుడ్ సినిమా అందుకోలేదు. జైలర్ సినిమా ఈ ఇయర్ కోలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు రజినీకాంత్ తో పోల్చుకుంటూ హిట్స్ కొడుతున్న యంగ్ స్టార్ హీరోలు… రజినీకాంత్ వయసు వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చే సత్తా ఉన్న రోజు ఆయన స్థాయిని చేరారని ఒప్పుకోవచ్చేమో. అప్పటివరకూ ఇండియాకి ఒకడే సూపర్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. జైలర్ హిట్ తో రజినీకాంత్ ఫ్యాన్స్ కి ఈ బర్త్ డే మరింత స్పెషల్ గా మారింది.