Rajinikanth: సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనం చేయాలంటే.. దొంగలు కూడా భయపడుతూ ఉంటారు. పోలీస్ కేసులు, మీడియా అటెన్షన్.. మాములుగా ఉండవు అని.. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే దొంగలు మాత్రం కేవలం సెలబ్రిటీస్ నే టార్గెట్ చేస్తున్నారు.. అందులోనూ ముఖ్యంగా రజినీకాంత్ కూతుర్లే వారి టార్గెట్. అవును.. ఈ మధ్యనే రజినీ పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో చోరీ సి జరిగిన విషయం తెల్సిందే. రూ.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలు పోయాయి అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఇంట్లో పనిచేస్తున్న పనివారే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేల్చేశారు. ఇక ఆ చోరీ ఘటన జరిగి నెల రోజులు అయ్యిందో లేదో.. ఇప్పుడు రెండో కూతురు ఇంట దొంగతనం జరిగింది.
NTR 30: ఇంట గెలిచి.. రచ్చ గెలువు పాప
రజినీ చిన్న కూతురు సౌందర్య రజినీకాంత్ ఇంట దొంగతనం జరిగింది. ఆమె తన ఎస్యూవీ కారు యొక్క కీ ని పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒక ఫంక్షన్ కు వెళ్లి వచ్చేలోపు తన కీని ఎవరో కొట్టేశారని తెలుపుతూ చెన్నైలోని తేనాంపేట పోలీసు స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. కారు తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లానని, కాలేజీ ఫంక్షన్ కు వెళ్లి వచ్చేలోపు కీ కనిపించడం లేదని తెలిపింది. ఇక ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు కీ ని వెతికి ఇస్తామని తెలిపారు. అదేం విచిత్రమో కానీ, రజినీ ఇద్దరు కూతుళ్లు ఇలా దొంగతనం కేసుల్లో హైలైట్ గా మారింది.