దర్శక ధీరుడు రాజమౌళి… ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలియజేసిన వాడు. రాజముద్ర పడితే చాలు వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు అంటే రాజమౌళి ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ టాప్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి గురించి మాట్లాడుతున్నారు, ప్రెస్టీజియస్ ఆస్కార్ కూడా ఇండియాకి వచ్చింది అంటే అది కేవలం రాజమౌళి వలనే. ఇండియన్ సినిమా బిజినెస్ కూడా 500 కోట్లు లేని సమయంలో వేల కోట్ల ఖర్చుతో ధైర్యంగా సినిమాలు చేసేలా ఫిల్మ్ ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేశాడు రాజమౌళి. ఈరోజు తెలుగు సినిమా, తమిళ సినిమా, మలయాళ సినిమా, హిందీ సినిమా అనే బౌండరీలు లేకుండా ఇండియన్ సినిమా అనే మాట వినిపిస్తుంది అంటే అది రాజమౌళి చూపించిన మార్గమే. నెక్స్ట్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు ఈ దర్శక ధీరుడు.
మహేష్ బాబుతో చాలా కాలంగా ఉన్న కమిట్మెంట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి. ఇప్పటికే కథ కంప్లీట్ అయ్యిందని విజయేంద్ర ప్రసాద్ కూడా చెప్పేసాడు. అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటివరకు #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో సోషల్ మీడియాలో కనిపించింది. ఇకపై ఇది #SSMB29 కాకుండా #SSRMB అనే హాష్ ట్యాగ్ లో ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ముందున్న ట్యాగ్ లో రాజమౌళి పేరు లేదు… ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా అనే కలిసింది. ఇప్పటికైతే SSMB29 కాకుండా SSRMB అనేదే వర్కింగ్ టైటిల్ అవుతుంది… లేదా ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ సమయంలో రాజమౌళి… ఇంకేదైనా ట్యాగ్ ని అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.