రెండు రోజులు.. కేవలం రెండు రోజుల్లో యావత్ సినీ అభిమానులందరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లో సందడి చేయనున్నది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో ప్రమోషన్ల జోరును పెంచిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇండస్ట్రీలో అనుకున్నట్లుగానే ప్రమోషన్ల యందు జక్కన్న ప్రమోషన్లు వేరయా అని.. ఈ సినిమాకు కూడా అదే ఫార్ములాను వాడాడు జక్కన. ఎవరు ఊహించేలేని స్టార్లతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఆసక్తి పెంచేశాడు. ఇప్పటికే డెరెక్టర్ అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, యాంకర్ సుమలతో ఆర్ఆర్ఆర్ త్రయం ఇంటర్వ్యూ లు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా అసలు ఎవరు ఊహించలేని డైరెక్టర్.. అర్జున్ రెడ్డి
ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకధీరుడు జక్కన్నని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఇక ఈ చిత్రం గురించి ప్రతి ఇంటర్వ్యూలోనూ ఏదో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పే జక్కన్న .. ఈ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ చొక్కాలు చింపుకొనే విషయాన్నీ చెప్పుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ని బ్రిటిష్ పోలీస్ అధికారి అయిన రామ్ చరణ్ అరెస్ట్ చేసే సీన్ ఉంటుంది. దాని వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది. అక్కడ ఒక 1000 మంది దొమ్మీగా కొట్టుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఏం చేయాలో తోచని రామ్ చరణ్ .. కంటనీరు పెడుతూనే వారిని కొడుతూ పక్కకి పంపించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అక్కడ ఎన్టీఆర్ కూడా ఉండడంతో ఎన్టీఆర్ ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ముందు ఈ సీన్ ని హాలీవుడ్ టాప్ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో చేసిన అంతగా సంతృప్తి రాలేదు. ఆ తరువాత అదే సీన్ ని సాల్మన్ అనే ఫైట్ మాస్టర్ కి అప్పగించాం. అతడు సరిగ్గా చేస్తాడో లేదో అని అనుకున్నా కానీ నెలరోజుల టెస్ట్ షూట్ చేసి తీసుకొచ్చి నన్ను ఇంప్రెస్ చేశాడు. దాంతో అతనే ఆ సీన్ చేశాడు. దాదాపు 2000 మంది ఉన్న ఆ సీన్ సినిమాకు హైలైట్ గా నిలవనుంది అని చెప్పుకొచ్చారు. ఇక దీంతో ఎన్టీఆర్ అరెస్ట్ సీన్ కి థియేటర్లో ఎవరు కూర్చోరు అని జక్కన్న ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ఇంకేముంది ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు చొక్కాలు చింపుకోవడానికి సిద్దమైపోయారంట.