SSMB 29 : స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ టైటిల్ అనౌన్స్ మెంట్ నవంబర్ 15న రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున సెట్ వేయిస్తున్నాడు జక్కన్న. అసలే సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో రాజమౌళి చేస్తున్న పని అందరినీ షాక్ కు గురి చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్ వేయిస్తున్నాడు. ఈవెంట్ కోసం బాహుబలి రేంజ్ లో సెట్ వేయించడం చూసి అంతా షాక్ అవుతున్నారు. బాబోయ్ ఏంట్రా ఇది అని కామెంట్లు పెడుతున్నారు.
Read Also : DMF Awards : గ్రాండ్ గా భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
కేవలం ఈవెంట్ కే ఈ రేంజ్ లో సెటప్ వేయిస్తే.. ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానులు. మహేశ్ బాబుతో చేస్తున్న మూవీని వరల్డ్ అడ్వెంచర్ గా తీస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తీసుకొస్తున్నాడు జక్కన్న. ఇక ఈ ఈవెంట్ ను ఓటీటీ ప్లాట్ ఫామ్ లో లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నాడు. ఒక సినిమా ఈవెంట్ కు ఫస్ట్ టైమ్ జియో హాట్ స్టార్ లైవ్ టెలికాస్ట్ చేయబోతోందని టాక్ వస్తోంది. ఈవెంట్ కు చాలా స్పెషల్ గెస్ట్ వస్తారనే టాక్ నడుస్తోంది. కానీ దానిపై ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. మరి ఈవెంట్ లో ఏం సర్ ప్రైజ్ ఇస్తాడో చూడాలి.
Read Also : JIGRIS : జిగ్రీస్ మూవీ నుంచి మీరేలే సాంగ్ రిలీజ్..