JIGRIS : యంగ్ హీరో రామ్ నితిన్, కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కృష్ణ వోడపల్లి ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ మూవీ టీజర్ ను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఫస్ట్ లిరికల్ సాంగ్ ను హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశాడు. ఇప్పుడు మరో సాంగ్ ను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రిలీజ్ చేశాడు. మీరేలే అంటూ సాగే ఈ పాట మంచి మెలోడీ థీమ్ తో వచ్చింది. ఫ్రెండ్స్ మధ్య సీన్లను గుర్తు చేస్తూ సాగుతుంది. లిరిక్స్, మ్యూజిక్, బీజీఎం ఆకట్టుకుంటున్నాయి.
Read Also : Rahul Ravindran : తాళి వేసుకోవడం వివక్ష లాంటిదే.. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్
నలుగురు కుర్రాళ్లు ఒక వింటేజ్ మారుతి కారులో గోవా వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వాళ్లు ఎదుర్కున్న సమస్యలు ఏంటి అనే కాన్సెప్టుతో ఫన్ అండ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే మూవీ ప్రమోషన్లలో జోరు పెంచబోతున్నారు. ఫ్రెండ్స్ మధ్య సాగే ఫన్నీ సీన్లతో వచ్చే సినిమాలు యూత్ ను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు జిగ్రీస్ కూడా అలాంటి దారిలోనే రాబోతోంది. రామ్ నితిన్ ఈ మధ్య మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అందుకే ఈ మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి.
Read Also : Allu Arjun : క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ కు బన్నీ బర్త్ డే విషెస్