Thandel wraps up first schedule: యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘తండేల్’ ఈ మధ్య సెట్స్ పైకి వెళ్ళింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉడిపి సహా అనేక ప్రాంతాల్లో జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్టు సినిమా యూనిట్ ప్రకటిస్తూ కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. ఇక ఈ సినిమాతో అద్భుతమైన మ్యాజికల్ లవ్ స్టోరీని చూడబోతున్నారని టీం ముందు నుంచి చెబుతోంది. షూట్ ప్రారంభించే ముందు టీమ్ ఇంటెన్స్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేసింది. నాగ చైతన్య కూడా తన పాత్ర కోసం కంప్లీట్ మేక్ఓవర్ అయ్యారు. అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు.
Jyothika: తమిళ రాక్షసి తెలుగులోకి వచ్చేస్తోంది.. అమ్మ ఒడి అంటోన్న జ్యోతిక
విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని శ్రీ నాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ‘తండేల్’ సారాంశాన్ని ఎసెన్స్ ఆఫ్ తండేల్ అనే పేరుతో ఆవిష్కరించి విజువల్ ట్రీట్‌ను అందించారు మేకర్స్. చేపలు పట్టడానికి సముద్రం మధ్యలో ఉన్న యువ సామ్రాట్ నాగ చైతన్య పాత్రను పరిచయం చేయడంతో గ్లింప్స్ ప్రారంభమయి ‘ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్…ఇక రాజులమ్మ జాతరే’ అని చైతు చెప్పిన మ్యాసీ డైలాగ్ తో అంచనాలు పెంచింది. అనుకోకుండా, పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు, వారిని కరాచీలోని సెంట్రల్ జైలులో బంధిస్తారు, అక్కడ వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. జైలర్ జాతీయవాదాన్ని ప్రశ్నించినప్పుడు, కథానాయకుడు “మా నుండి ఊడిపోనా ఒక ముక్క… మీకే అంతుంటే.. ఆ ముక్కని ముష్టేసిన మాకెంతుటుంది… భారత్ మాతా కీ జై…” అని జైలర్ కి తగిన సమాధానం ఇవ్వడం కూడా గూజ్ బంప్స్ పెంచేలా ఉంది.
Team #Thandel wraps up a schedule in the beautiful scenic village ❤️
The primary cast took part in this schedule where key scenes were shot in port & villages ⚓
Await for some exciting updates coming your way soon 🌊#Dhullakotteyala 🔥🔥
Yuvasamrat @chay_akkineni… pic.twitter.com/rNFWecPmVe— Geetha Arts (@GeethaArts) February 5, 2024