బాలీవుడ్ లో పోర్నోగ్రఫీ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన పాల్సీలు అతడిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. గత కొన్నాళ్ళు జైల్లో ఉన్న రాజ్ కుంద్రా ఇటీవలే బెయిల్ పై బయటకి వచ్చాడు. ఇక అతను బయటికి వచ్చినదగ్గరనుంచి మీడియా అతనిపై ఫోకస్ చేసిన సంగతి విదితమే.. ఎక్కడ రాజ్ కుంద్రా కనిపించినా మీడియా వదలడం లేదు. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తుంది. దీంతో రాజ్ కుంద్రా మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇటీవల ఏలియన్ మాస్క్ పెట్టుకొని ముంబై వీధుల్లో తిరుగుతూ ఇదిగో ఇలా కెమెరా కంటికి చిక్కాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
బాలీవుడ్ సెలబ్రెటీగా మంచి పేరు తో దేశం మొత్తం కూడా పాపులారిటీని దక్కించుకున్న రాజ్ కుంద్రా ఇప్పుడు కనీసం మీడియా కంట పడకుండా తిరిగే పరిస్థితి వచ్చింది. అరెరే ఏం హాలాత్ అయిపోయింది జీవితం .. ఎలా ఉండే మనిషి.. ఎలా అయిపోయాడు. శిల్పా శెట్టి భర్తగా సగర్వంగా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టిన ఈయన ఇప్పడూ ఇలా ఏలియన్ మాస్క్ పెట్టుకొని భయంభయం గా తిరుగుతున్నాడు అని కొందరు.. మరికొందరు ఎక్కడ మీడియా కంటపడి.. వారు ఏవేవో రాస్తే మరోసారి పోలీసులు పట్టుకుంటారని భయంతో ఉన్నాడేమో అని మరికొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఇంకొందరు అర్రే మాస్క్ భలే ఉందే.. రాజ్ కుంద్రా భయ్యా మాస్క్ ఎక్కడ కొన్నావో మాక్కూడా చెప్పవా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే శిలా భర్త కేసు తరువాత ఎంతో మానసిక వేదనకు గురైన విషయం విదితమే.. ప్రస్తుతం ఆమె పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.