Raghava lawrence Comments on Kangana Ranaut: రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్న సందర్భంగా శనివారం ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ‘‘వాసుగారు ‘చంద్రముఖి2’ మూవీ చేస్తున్నామని అనౌన్స్ చేయగానే రజినీకాంత్‌గారితో చేస్తున్నారేమోనని అనుకున్నా ఆయనతో ఫోన్ చేసి మాట్లాడితే రజినీగారు బిజీ షెడ్యూల్ వల్ల చేయటం లేదు మరో హీరోతో చేయాలనుకుంటున్నానని అన్నారు. సరే కథ ఎప్పుడు చెబుతారని అనగానే సాయంత్రం కలవమని అన్నారు అలా నేను వెళ్లగానే ఆయన కథ చెప్పారు, నాకెంతో నచ్చింది అని అన్నారు. రజినీకాంత్‌గారు చేసిన రోల్‌లో నేను నటించటం అంటే ఆ రాఘవేంద్రస్వామిగారి అదృష్టం అని అనుకోవాలని పేర్కొన్న లారెన్స్ సూపర్‌స్టార్ చేసిన ఆ పాత్రను నేనెంత గొప్పగా చేయగలనా? అని ఆలోచించలేదు, నా పాత్రకు నేను న్యాయం చేస్తే చాలని అనుకుని చాలా భయపడుతూ నటించా, కచ్చితంగా సినిమా మీ అందరినీ మెప్పిస్తుందని అనుకుంటున్నాను.
Sagileti Katha: ‘సగిలేటికథ’కి U/A సర్టిఫికేట్….అక్టోబర్ 6న రీలిజ్
కంగనా రనౌత్ వంటి పెద్ద స్టార్‌తో నటించటం లక్కీ అని ముందు ఆమె సెట్స్‌లోకి అడుగు పెట్టగానే ఆమెకున్న సెక్యూరిటీని చూసి భయపడ్డానని అన్నారు. ఆ విషయం ఆమెకు చెప్పగానే ఆమె సెక్యూరిటీని బయటకు పంపేశాక చక్కగా కలిసిపోయి నటించారని అన్నారు. చంద్రముఖి పాత్రలో ఆమె భయపెట్టారని అన్నారు. వాసుగారితో ఇది వరకు శివలింగ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా ‘చంద్రముఖి2’ చేశామని, ఈ సినిమా చేస్తున్నా అని అనుకున్న తర్వాత సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారికి ఫోన్ చేసి విషయం చెప్పానని అన్నారు. తన గురువుగారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్న ఆయన ఈ సినిమాలో వేట్టయార్ రోల్ చేసినప్పుడు కూడా రజినీగారి ఆశీర్వాదాలు తీసుకునే నటించానని, అన్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణిగారు, వడివేలు వంటి స్టార్ కమెడియన్‌తో మళ్లీ పనిచేయటం మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్ అని ఆయన అన్నారు.