Sagileti Katha Releasing in theatres on October 6th: యూట్యూబర్ రవితేజ మహాదాస్యం, రచ్చలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సగిలేటి కథ. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించగా హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్‌లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడంతో పాటు, విడుదలైన సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ అందుకుంది.
Riniki Bhuyan Sarma: ఎంపీపై సీఎం భార్య పరువు నష్టం దావా
ఈ చిత్రం చాలా నాచురల్ గా సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉందని, ఇలాంటి కథ మునుపెన్నడూ చూడలేదని ఖచ్చితంగా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని సెన్సార్ బోర్డు ముఖ్య సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అక్టోబర్ 6న విడుదల తేదీని ప్రకటించారు. నిజానికి రాయలసీమ నేపథ్యంలో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో ఎక్కువ ఆ అత్యధిక భాగం సీమలోని ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రతిబింబించేలా తెరకెక్కించారు. వాటికి భిన్నంగా ‘కొండపొలం’ లాంటి సినిమాలు కొన్ని వచ్చాయని ఇప్పుడు తాజాగా ‘సగిలేటి కథ’ కూడా సరికొత్తగా ఉందని అంటున్నారు.