Radhika Apte : పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు భారీ ప్లాపులను మూటగట్టుకున్నాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంత క్రేజ్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమిళ హీరోతో పూరీ సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ చేస్తుండటంతో అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉన్నాయి.
Read Also : MI vs GT: నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. క్వాలిఫయర్-2లో తలపడేదెవరో?
ఇందులో రాధికా ఆప్టే నటిస్తోందని ఈ నడుమ ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. వాటిపై తాజాగా ఆమె స్పందించింది. తాను ఆ మూవీలో నటించట్లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి తన వద్ద వాటితో బిజీగా ఉన్నట్టు చెబుతోంది. పూరీ, సేతుపతి సినిమా గురించి తాను కూడా విన్నానని.. కానీ ఇప్పటి వరకు వారు తనను సంప్రదించలేదని తెలిపింది. ఏదైనా అప్డేట్ ఉంటే చెబుతానంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఈ మూవీని విభిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. మరి ఇందులో ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారో చూడాలి.
Read Also : Rakul Preet : నటికి విరాట్ కోహ్లీ లైక్.. ఘాటుగా స్పందించిన రకుల్ ప్రీత్..