యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్గా “రాధేశ్యామ్”. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీ కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధే శ్యామ్‌ను ‘రెబల్‌స్టార్’ డాక్టర్ యు వి కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14, 2022న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Read Also : సాయి తేజ్ నెక్స్ట్ మూవీ… అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
కొన్ని రోజుల నుంచి ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా “రాధేశ్యామ్” అప్డేట్ కావాలని మేకర్స్ ని డిమాండ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే ‘రాధేశ్యామ్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతోంది అంటూ ఓ డేట్ బయటకు వచ్చింది. అలా జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ అదే తేదీన ‘రాధేశ్యామ్’ నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు మేకర్స్. “రాధే శ్యామ్” నుండి “ఈ రాతలే” అనే లిరికల్ వీడియోను నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నెఱకు ఆసక్తిని రేకెత్తించే పోస్టర్ ను రిలీజ్ చేశారు.