బాలీవుడ్ నుండి మరో హైలీ యాంటిసిపెటెడ్ ఫ్రాంచేజీ ఫిల్మ్ రాబోతుంది. ధర్డ్ ఫ్రాంచైజీలో మిస్సైన హీరో.. మళ్లీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అతడికి తోడవుతున్నాడు మరో యంగ్ హీరో. ఓ సినిమాకు సీక్వెల్స్ తీయడం బాలీవుడ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఏడాదికి ఫ్రాంచేజీ మూవీస్ ఐదైనా దింపేస్తోంది. ఇప్పుడు అలాంటి ఓ యాంటిసిపెటెడ్ ఫ్రాంచైజీ ఫిల్మ్ తీసుకురాబోతుంది. అదే రేస్ 4. 2008లో స్టార్టైన రేస్ ఫ్రాంచేజీ నుండి వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాయి. ఈ వెంచర్ నుండి ఫోర్త్ సిరిస్ రాబోతుంది.
Also Read : RGV : విచారణకు హాజరైన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ..
రేస్, రేస్ 2లో మెయిన్ లీడ్ గా చేసిన సైఫ్ అలీఖాన్ రేస్ 3లో మిస్సయ్యాడు. ఆ ప్లేసును కబ్జా చేశాడు సల్మాన్ ఖాన్. దర్శకుడుకు కూడా ఛేంజయ్యాడు. కానీ రేస్ 4 మిస్ చేసుకోనంటున్నాడు సైఫ్. ఈ మధ్య విలనిజంతో దారి తప్పిన కెరీర్ అండ్ పర్సనల్ ట్రాక్ మళ్లీ రేస్ 4తో పట్టాలెక్కించాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఇందులో మరో యంగ్ యాక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా కనిపించబోతున్నాడు. ఈ ఫ్రాంచేజీలో సిద్దు రావడం ఇదే ఫస్ట్ టైం. రేస్ ఫ్రాంచైజీస్ అంటే హీరోలే కాదు హీరోయిన్లకు కూడా యమ క్రేజ్. దీపికా, కత్రినా, బిపాషా, అమీషా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లాంటి భామలు రేస్ చిత్రాలకు ఓ మార్కెట్ తెచ్చారు. అలాగే రేస్ 4లో కూడా ఇద్దరు క్యూటీ అండ్ యంగ్ బ్యూటీస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ముంజాతో పాపులరైన శార్వరి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఇందులో యాక్ట్ చేయబోతున్నారు. డైరెక్టర్ ఇతర కాస్టింగ్ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.