Raashi Khanna : పవన్ కల్యాణ్ పక్కన బడా ఛాన్స్ కొట్టేసింది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న రాశిఖన్నాను.. దాదాపు టాలీవుడ్ పక్కన పెట్టేసింది. ఆమెకు సౌత్ లో పెద్దగా ఛాన్సులు రాని సమయంలో మంచి ఆఫర్ పట్టేసింది. రాశిఖన్నా చివరగా హిట్ కొట్టి చాలా రోజులు అవుతోంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఏళ్లు గడుస్తోంది. ఏదో ఒక సినిమా ట్రై చేసినా అవన్నీ ప్లాప్ కావడంతో టాలీవుడ్ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నా అక్కడ పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇలాంటి టైమ్ లో నక్కతోక తొక్కినట్టే ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ షూట్ చాలా రోజుల తర్వాత మళ్లీ రీ స్టార్ట్ అయింది.
Read Also : HHVM : ఫైట్ సీన్ కోసం 60 రోజులు కష్టపడ్డ పవన్..
ప్రస్తుతం స్పీడ్ గా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇంకో హీరోయిన్ రోల్ కోసం రాశిఖన్నాను తీసుకుంటున్నారు. ఆమె త్వరలోనే సెట్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో రాశికి మళ్లీ ఛాన్సులు పెరుగుతాయని భావిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇది గనక హిట్ అయితే రాశిఖన్నాకు మళ్లీ అదృష్టం పట్టుకున్నట్టే. పవన్ కల్యాణ్ తో రాశికి ఇదే మొదటి మూవీ. ఆమె ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రలో చేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Coolie : హైదరాబాద్ లో ‘కూలీ’ ఆడియో ఈవెంట్.. ఎప్పుడంటే..?