Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ఇప్పటికే నిర్వహించారు. ఇక తాజాగా హైదరాబాద్ లో అనిరుధ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. జులై 22న ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్ లో రజినీ పాల్గొంటారా లేదా అనేది క్లారిటీ రాలేదు.
Read Also : HHVM : వీరమల్లు బ్లాక్ బస్టర్ అవుద్ది.. నిర్మాత కాన్ఫిడెన్స్..
కానీ అనిరుధ్ ఈ ఈవెంట్ లో మూడు పాటలు స్వయంగా పాడబోతున్నాడు. ఇందులో లిమిటెడ్ ఎంట్రీ పాస్ లు జారీ చేస్తున్న్టు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, టీజర్లు అంచనాలు పెంచేశాయి. ఇందులో రజినీ పాత్ర గురించే భారీ చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు రజినీకాంత్ కనిపించనటువంటి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఏషియన్ సునీల్ ఈ మూవీ రైట్స్ ను దక్కించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ నటించిన వార్-2 సినిమాతో కూలీ పోటీ పడబోతోంది. ఈ రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. కానీ బాక్సాఫీస్ వద్ద ఏది సత్తా చాటుతుందో చూడాలి.
Read Also : Mahesh Babu : సితార పై.. మహేష్ ఎమోషనల్ పోస్ట్ !