ఇటీవల మలయాళ చిత్రసీమ మొత్తాన్ని షేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాని తెలుగులో వారం రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఏప్రిల్ ఆరవ తేదీన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, సినిమా నిర్మాణ సంస్థ పరవ ఫిలింస్ తో కలిసి తెలుగులో రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాని చెప్పా పెట్టకుండా ఈరోజు పివిఆర్ ఐనాక్స్ థియేటర్ల నుంచి తప్పించారు. అయితే ఈ చర్య వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. తెలుగు సిని నిర్మాతల మండలి (తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ) ఆధ్వర్యంలో ఈ మేరకు ఒక మీటింగ్ జరుగుతోంది. గతంలో కూడా పలుసార్లు ఈ నేషనల్ థియేటర్ చైన్స్ ఇలాగే వ్యవహరించాయని మరోసారి ఇలా జరగకుండా ఏం చేయాలి అనే విషయం మీద మీటింగ్ జరపబోతున్నారని తెలుస్తోంది.
Also Read; Samantha: సూట్ విప్పేసిన సమంత.. షేక్ అవుతున్న ఇంటర్నెట్!
పీవీఆర్ మల్టిఫ్లెక్స్ మంజుమల్ బాయ్స్ తెలుగు వర్షన్ ప్రదర్శనలను ఆపేసింది. మలయాళ నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఆ చిత్ర ప్రదర్శనలను ఆపేసినట్లు పీవీఆర్ వెల్లడించింది. పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే తెలుగు వర్షన్ ను ఎలా ఆపేస్తారని ప్రశ్నించారు. మంచి వసూళ్లు సాధిస్తున్న క్రమంలో అర్థాంతరంగా ఆపేయడం అన్యాయమన్న శశిధర్ రెడ్డి… ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నట్లు తెలిపారు. పీవీఆర్ మల్టిప్లెక్స్ వ్యవహారశైలిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పీవీఆర్ మల్టిఫ్లెక్స్ తీరుపై ఈ రోజు సాయంత్రం అత్యవసర సమావేశం కానుంది. నిజానికి ఈరోజు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన చోటేమియాన్ బడే మియాన్ సినిమా రిలీజ్ అవుతోంది. ఆ సినిమా కోసం మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వర్షన్ ని పివిఆర్, ఐనాక్స్ సంస్థల ధియేటర్ల నుంచి తొలగించినట్లుగా ప్రచారంజరిగింది.