దీపావళి పండుగకు “పుష్ప” టీమ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్ ప్రధాన పాత్రల్లో, ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఇప్పటికే సినేమా నుంచి మూడు సింగిల్స్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. “దాక్కో దాక్కో మేక”, “శ్రీవల్లి”, “సామీ సామీ” విడుదల చేసారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తన్నారు. గతంలో కూడా డిఎస్పీ, సుకుమార్, అల్లు అర్జున్ ఆర్య, ఆర్య 2 చిత్రాలకు కలిసి పని చేశారు. ఆ రెండు చిత్రాలు కూడా మ్యూజికల్ గా సూపర్ హిట్. ఇదిలా ఉండగా తాజాగా “పుష్ప”రాజ్ అభిమానులకు దీపావళి ట్రీట్ ఇవ్వబోతున్నాడట.
Read Also : పునీత్ కోసం కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్న విశాల్… ఎమోషనల్ స్పీచ్
దీపావళిని పురస్కరించుకుని నవంబర్ 4న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ‘పుష్ప’ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. “పుష్ప: ది రైజ్” ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. నవంబర్ మధ్యలో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ 17న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.