ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప” సందడి మొదలైంది. ఐకాన్ స్టార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 3000లకు పైగా థియేటర్లలో ఈరోజు విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్, రష్మిక పల్లెటూరి పిల్లగా మారిపోగా, పాటలు చేసిన మ్యాజిక్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. శుక్రవారం తెల్లవారుజామున బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు నిర్వహించగా ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. మరి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందా ? లేదా? అనేది తెలుసుకోవాలంటే పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం.