Puri Jagannadh: బ్రేకింగ్.. పూరిని బ్లాక్ మెయిల్ చేసిన బయ్యర్స్.. ఆడియో లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవలే లైగర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. పూరి జగన్నాథ్ తో పాటు బయ్యర్స్ కూడా కొన్ని కోట్లు నష్టపోయారు. అయితే సినిమా నష్టపోవడంతో తమ పరిస్థితి ఏంటి అని బయ్యర్స్ అడగడంతో అందరికి నష్టపరిహారం ఇస్తామని పూరి చెప్పుకొచ్చాడు. ఎంతో కొంత అడ్జస్ట్ చేస్తానని చెప్పడంతో కొన్నిరోజులు బయ్యర్స్ ఓపిక పట్టారు. కానీ, ఇంకా పూరి నుంచి డబ్బులు రాలేదని బయ్యర్స్ అందరూ కలిసి ధర్నా చేస్తామని పూరిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయమై పూరి మాట్లాడిన ఆడియో లీక్ ఆయ్యింది.
” ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తున్నాను ఎందుకు? పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని. ఆల్రెడీ బయర్స్ తో మాట్లాడ్డం జరిగింది. ఒక నెలలో అగ్రీ ఐన అమౌంట్ ఇస్తా అని చెప్పను. ఇస్తాను అని చెప్పాక కూడా అతి చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ది కాదు. ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని ఆడతాయి. కొన్ని పోతాయి. ఒకసారి సినిమా హిట్ అయితే బయ్యర్స్ దగ్గరనుంచి డబ్బు తీసుకోవడానికి మేము తిరగలి. పోకిరి దగ్గరనుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎంతో వుంది. బయర్స్ అసోసియేషన్ నాకు ఆ అమౌంట్ వసూలు చేసి పెడతారా? ధర్నా చేస్తాం అంటున్నారు. చెయ్యండి. ధర్నా చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకోని, వాళ్ళకి తప్ప మిగతావాళ్ళకి ఇస్తా” అంటూ పూరి కోపంతో మాట్లాడిన ఈ ఆడియో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మరి ఈ విషయమై సినీ పెద్దలు ఏమంటారో చూడాలి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు