‘Project K’ release date locked!
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ‘ప్రాజెక్ట్ కె’ మూవీ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. ఈ సినిమా గురించి అశ్వినీదత్ గురువారం మాట్లాడుతూ, ”తమ బ్యానర్ నుండి రాబోతున్న ‘ప్రాజెక్ట్ కె’ సూపర్ గా ఉండబోతోందని అన్నారు. దాని కోసం నాగ్ అశ్విన్ అద్భుతమైన కథను తయారు చేశాడని, అతను ఇంటర్నేషనల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని దానిని రూపొందించాడని అన్నారు. ప్రముఖ నటుడు అమితాబ్ కథ విన్న తర్వాత ఎప్పుడెప్పుడు షూటింగ్ కు హాజరవుతానా? అని ఎదురు చూశారని తెలిపారు. దీపికా పదుకునే, ప్రభాస్ కూడా చాలా బాగా ఇంప్రస్ అయ్యారని అన్నారు. ‘ప్రాజెక్ట్ కె’ గొప్ప సినిమా అవుతుందని, దాని షూటింగ్ జనవరికి పూర్తవుతుందని, అక్కడ నుండి ఎనిమిది నెలల పాటు గ్రాఫిక్స్ వర్క్ పని ఉంటుందని, ఇప్పటికే కొన్ని దేశాలలో వర్క్ మొదలైందని చెప్పారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే… ప్రభాస్ బర్త్ డే కానుకగా ఓ వారం ముందే అంటే అక్టోబర్ 18, 2023లో ‘ప్రాజెక్ట్ కె’ను రిలీజ్ చేస్తామని అశ్వనీదత్ అన్నారు.