Producer Tutu Nayak accused of slapping lady journalist: ఒడిశా సినీ పరిశ్రమలో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. నటుడు మనోజ్ మిశ్రాపై నిషేధం చుట్టూ వివాదం కొనసాగుతుండగా, ఒడిశా నిర్మాత సంజయ్ నాయక్ అలియాస్ టుటు నాయక్ చిక్కుల్లో పడ్డారు. శుక్రవారం నాడు భువనేశ్వర్ నగరంలోని ఓ థియేటర్‌లో సినిమా విడుదల కార్యక్రమాన్ని కవర్ చేస్తుండగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండానే తన బ్యాక్ ను టచ్ చేశారని ఆరోపిస్తూ ఈటీవీ భారత్ మహిళా జర్నలిస్టు దేబాస్మితా రౌత్ ఖరవేల నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. “సినిమా నిర్మాత తూటు నాయక్ ఎటువంటి కారణం లేకుండా నా బ్యాక్ మీద కొట్టారు, నన్ను తిట్టారు. ఇది చాలా అకస్మాత్తుగా జరిగింది, నేలపై పడిన మొబైల్ ఫోన్ తీసుకుంటుండగా సంజయ్ నాయక్ ఎలాంటి కారణం లేకుండా తన వెనుక భాగంపై కొట్టాడని, దుర్భాషలాడాడని జర్నలిస్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Maa Oori Polimera 2: మా ఊరి పొలిమేర2కి మెంటలెక్కించే కలెక్షన్లు
అలా ప్రవర్తించినందుకు తనకు క్షమాపణ చెప్పాల్సిన నిర్మాత నవ్వుతూ వెళ్లిపోవడంతో తాను అవమానంగా భావించానని రౌత్ మీడియాకు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిర్మాతపై కేసు నమోదైంది. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణకు ఆదేశించి థియేటర్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కేసు నమోదు చేశారు. నాయక్ ఈ ఆరోపణను ఖండించారు. రౌత్ తన కుమార్తె లాంటిదన్న ఆయన నేను అవతలి హాల్లోకి వెళ్ళే తొందరలో ఆమె వీపు మీద మెల్లగా తట్టి దారి అడిగానని అన్నాడు. సాయంత్రం తర్వాత, రే తన ప్రవర్తనకు క్షమాపణలు చెబుతూ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశాడు. “ఆమె నా కూతురు లాంటిది, వృత్తిపరంగా నాకు ఆమె గురించి తెలుసు, నాకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవు. ఈరోజు జరిగిన దానికి చింతిస్తున్నాను అని ఆయన అన్నారు.