Mirai : తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ భారీ హిట్ కొట్టింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొత్తానికి ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే మిరాయ్ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది ఈ మూవీ. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత విశ్వ ప్రసాద్.. గతేడాది తాను రూ.140 కోట్ల దాకా నష్టపోయానని ఎమోషనల్ అయ్యారు.
Read Also : Disco Dancer : ఇండియాలో తొలి వంద కోట్ల సినిమా ఏదో తెలుసా..?
నేను నిర్మించిన వడక్కుపట్టి రామస్వామి, ఈగల్, మనమే, విశ్వం, స్వాగ్, మిస్టర్ బచ్చన్ సినిమాలు గతేడాది రిలీజ్ అయ్యాయి. అవి థియేటర్లలో బాగానే ఆడినా.. ఓటీటీలో అంతగా లాభాలు తేలేదు. లేట్ గా రిలీజ్ కావడంతో చాలా నష్టాలు వచ్చాయి. రూ.140 కోట్ల వరకు నష్టపోయాను. అవి ఇంకా రికవరీ కాలేదు. అవుతాయనే నమ్మకం కూడా లేదు. అయినా సరే సినిమాలపై ఉన్న ప్రేమతోనే కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాను అంటూ తెలిపారు విశ్వ ప్రసాద్.
Read Also : Bigg Boss 9 : ఏంటీ పిచ్చి పని.. సుమన్ శెట్టిని లాగి పడేసిన డిమాన్ పవన్..