SKN : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వీరాభిమానులు ఉంటారు. అందులో నో డౌట్. ఆయన అభిమానులకు సాయం చేయడంలో కూడా ఎంతో ముందుంటారు. అయితే తాజాగా ఆయన అభిమాని చాలా ఇబ్బందుల్లో ఉంటే.. నిర్మాత ఎస్కేఎన్ భారీ సాయం చేశారు. ఎస్కేఎన్ బేబీ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే కదా. అప్పటి నుంచి చాలా సినిమాల్లో కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ.. కొన్నింటికి మెయిన్ ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడు. తాజాగా మహేష్ బాబు అభిమాని రాజేష్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం చనిపోయారు. ఇదే విషయాన్ని చెబుతూ రమేష్ నాయక్ అనే నెటిజన్ వివరాలతో సహా ట్వీట్ చేశాడు.
Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవి తొలిరోజు కస్టడీ.. కీలక విషయాలు రాబట్టిన పోలీసులు
ఈ ట్వీట్ చూసిన ఎస్‌కేఎన్ ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. రాజేష్ ఇంటికి వెళ్లిన ఎస్కేఎన్ ఆ కుటుంబానికి రూ.2లక్షల సాయం అందించాడు. రాజేష్‌కు 10 ఏళ్ల కొడుకు, ఆరేళ్ల కూతురు ఉండటంతో వారి చదువుల కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపాడు. అక్కడే వారికి చెక్ ను కూడా అందజేశాడు ఎస్కేఎన్. దీంతో ఆయనకు నెటిజన్లు థాంక్స్ చెబుతున్నారు. మంచి పని చేశారంటూ ప్రశంసిస్తున్నారు. ఎస్కేఎన్ ప్రజెంట్ ఆనంద్ దేవరకొండతో కలిసి మరో సినిమా చేస్తున్నాడు.
Read Also : Bheems : నేను తప్పుగా మాట్లాడలేదు.. భీమ్స్ క్లారిటీ