DJ Tillu: మలయాళ బ్యూటీ, కర్లీ హెయిర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ‘DJ టిల్లు స్క్వేర్’ సినిమా నుంచి తప్పుకుందనే వార్త గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది. DJ టిల్లు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ కథ మాటలు రాయడమే కాకుండా ఈ సీక్వెల్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివలే అనౌన్స్ అయిన ఈ సినిమాని కష్టాలు వెంటాడుతున్నాయి. ముందుగా ‘DJ టిల్లు స్క్వేర్’ నుంచి దర్శకుడు తప్పుకున్నాడు, ఆ తర్వాత హీరోయిన్ గా అనుకున్న శ్రీలీల తప్పుకుంది, రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. ఆమె కూడా ఈ సీక్వెల్ నుంచి తప్పుకుందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది.
Read Also: Ranjithame: కిక్ ఇవ్వలేదు మాస్టారు
దీంతో కొందరు “DJ టిల్లు హిట్ అవ్వడంతో సిద్ధు జొన్నలగడ్డకి హెడ్ వెయిట్ ఎక్కువ అయ్యింది. అందుకే ఈ సీక్వెల్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నాడు. హీరోయిన్ శ్రీలీల తప్పుకుంది, ఇప్పుడు ఆమె స్థానంలో వచ్చిన అనుమప కూడా వెళ్లిపోయింది. DJ టిల్లు సెట్స్ లో అనుపమ పరమేశ్వరన్, సిద్ధు జొన్నలగడ్డకి మధ్య సీరియస్ డిస్కషన్ జరిగింది” ఇలా ఎవరికి తోచింది వాళ్లు రాయడం మొదలు పెట్టారు.
తన సినిమాకి, తన ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకి, తన రెపుటేషన్ కి బాడ్ నేమ్ వస్తుంటే ఆ ప్రొడ్యూసర్ ‘నాగ వంశీ’ సైలెంట్ గా ఉంటాడా? కోట్లు ఖర్చు పెడుతున్నాడు కదా, తన సినిమా గురించి రూమర్స్ వస్తుంటే బయటకి వచ్చి డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు. DJ టిల్లు స్క్వేర్ గురించి కొన్ని రూమర్స్ రాసిన ఒక వెబ్ సైట్ కి, మీలో మంచి రైటర్ ఉన్నాడు సినిమాల్లో ట్రై చేయండి అంటూ నాగ వంశీ రిప్లై ఇచ్చాడు. నాగ వంశీ ఇచ్చిన రిప్లైకి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే అనుపమ స్థానంలో మడోన్నా సెబాస్టియన్ ‘DJ టిల్లు స్క్వేర్’ లోకి ఎంటర్ అయ్యిందని సమాచారం. ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.