ఒక భాషలో సూపర్ హిట్ అయిన సాంగ్ ని ఇంకో భాషలో వినాలి అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. అప్పటికే ఒరిజినల్ వర్షన్ సాంగ్ ని ఆడియన్స్ వినేయడం వలన ఇంకో భాషలో అదే పాటని వినీ ఎంజాయ్ చేయడం అన్నిసార్లూ అయ్యే పని కాదు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉంది ‘రంజితమే’ సాంగ్. దళపతి విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమాని తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగులోనే కాదు హిందీలో కూడా వారిసు సినిమా రిలీజ్ అవుతుందనే క్లారిటీ ఇచ్చేశాడు. ఇక రిలీజ్ కి సమయం దగ్గర పడుతుంది కాబట్టి తెలుగు ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టిన చిత్ర యూనిట్, ‘రంజితమే’ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
“బొండుమల్లె చెండు తెచ్చా, భోగాపురం సెంటూ తెచ్చా… కళ్ళకేమో కాటుక తెచ్చా, వడ్డానం నీ నడుముకిచ్చా… నక్షత్రాల తొట్టె తెచ్చా, తానాలాడ పన్నీరిచ్చా… వానవిల్లు చీర తెచ్చా, కట్టుకున్నా నిన్నూ మెచ్చా….” అంటూ సాగిన తెలుగు వర్షన్ రంజితమే బాగానే మొదలయ్యింది కానీ తర్వాత వచ్చిన “ముంజకాయ పెదాలు, మూతిపళ్ళ జిగేలుతో” అంటూ రొటీన్ స్టఫ్ లోకి వచ్చేస్తుంది. తెలుగు లిరిక్స్, ఒరిజినల్ రంజితమే సాంగ్ ని మ్యాచ్ చేస్తున్నాయి కానీ ఎందుకో తమిళ వర్షన్ విన్న ఫీల్, తెలుగులో రాలేదు. లిరిక్స్ అర్ధంకాలేదు కాబట్టి తమిళ రంజితమే వినడానికి బాగుందేమో, తెలుగులో లిరిక్స్ అర్ధం అవుతున్నాయి కాబట్టే అంతగా ఎక్కట్లేదు. వినగా వినగా తెలుగు సాంగ్ కూడా నచ్చొచ్చేమో కానీ ఇన్స్టాంట్ గా అయితే తమిళ వైబ్ లేదని క్లియర్ గా తెలుస్తోంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన రంజితమే సాంగ్, ఇప్పటివరకూ 70 మిలియన్ వ్యూస్ రాబట్టింది. తెలుగు ఆడియన్స్ కూడా రంజితమే తమిళ వర్షన్ ని బాగానే విన్నారు. ఈ ఇంపాక్ట్ తెలుగు రంజితమే సాంగ్ పైన తప్పకుండా పడుతుంది. అందుకే చిత్ర యూనిట్, నెక్స్ట్ టైం నుంచి రెండు పాటలని ఒకేసారి విడుదల చేస్తే ఏ భాష వాళ్లు ఆ భాషలో పాటని వింటారు.