HHHVM : పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు. ట్రైలర్ విడుదల కోసం ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వస్తోంది. ఇంకా పది రోజులే ఉంది.. ఇంకెప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారంటూ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత ఏఎం రత్నం ట్రైలర్ రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చారు.
Read Also : Hardik Pandya: శ్రేయస్ బ్యాటింగ్ చూసి మతిపోయింది.. ఈ రోజు బూమ్ పేలలేదు!
‘ఫ్యాన్స్ ఆవేదన నాకు తెలుసు. వారు ట్రైలర్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కానీ సెకండ్ హాఫ్ లో సీజీ వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఆ పనులు స్పీడ్ గా సాగుతున్నాయి. అతి త్వరలోనే వాటిని కంప్లీట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ఆ పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు టైమ్ పడుతుంది’ అంటూ నిర్మాత చెప్పారు. చూస్తుంటే రెండు మూడు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
పవన్ కల్యాణ్ కూడా ప్రమోషన్లలో పాల్గొనేందుకు డేట్స్ కేటాయించాడంట. రెండు కీలక ఇంటర్వ్యూలు, మూడు భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారంట.
Read Also : Singer Chinmayi: నను ఎవరితో పోల్చి చూడాల్సిన పని లేదు..