Priyanka Jawalkar : తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఆమె దాన్ని కరెక్టుగా వాడుకోలేకపోయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ట్యాక్సీవాలా సినిమాలో నటించింది. కానీ ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ మూవీ హిట్ అయినా.. అమ్మడికి పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ట్యాక్సీవాలా సినిమా గురించి ఆమె ఓ షాకింగ్ ఇన్సిడెంట్ ను బయట పెట్టేసింది. తాను చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్న టైమ్ లో ట్యాక్సీవాలాలో ఆఫర్ వచ్చిందని.. దాన్ని అస్సలు నమ్మలేకపోయానని తెలిపింది.
Read Also : Peddi : ఆ క్రికెట్ షాట్ వెనక బుచ్చిబాబు మార్క్.. ఏం టైమింగ్ రా బాబు..!
‘గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో ఛాన్స్ వచ్చింది. పైగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ అన్నారు. కొన్ని రోజులు నేను కూడా నమ్మలేదు. మధ్యలోనే తీసేస్తారేమో.. ఛాన్స్ వచ్చినట్టు ముందే ఎందుకు చెప్పడం.. అందరికీ తెలిస్తే పరువు పోతుందని అనుకున్నాను. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత నాకు నమ్మకం కలిగింది. ఆ తర్వాతనే మా ఇంట్లో వాళ్లకు అందరికీ చెప్పాను. ఆ మూవీలో నన్ను చూసుకుని చాలా సంతోషపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఆమె ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. టిల్లు స్వ్కేర్ లో ఆమె లైలా పాత్రలో నటించింది. దాని తర్వాత మళ్లీ ఆమెకు హీరోయిన్ గా ఛాన్సులు రావట్లేదు.