Peddi : రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది ఫస్ట్ గ్లింప్స్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 24 గంటల్లోనే 36.5మిలియన్ వ్యూస్ తో టాలీవుడ్ లో టాప్ పొజీషన్ లో నిలబడింది. ఈ మూవీ గ్లింప్స్ కు వచ్చినంత వ్యూస్ మరే దానికి రాలేదు. ఇంతగా గ్లింప్స్ వైరల్ కావడం వెనక రామ్ చరణ్ క్రికెట్ షాట్ ఉంది. చివర్లో రామ్ చరణ్ బ్యాట్ ను నేలకేసి కొట్టి మరీ సిక్స్ కొట్టే షాట్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. నిర్మాత రవిశంకర్ చెప్పినట్టే ఈ షాట్ కోసం ఫ్యాన్స్ తమకు తెలియకుండానే చాలాసార్లు ఈ వీడియోనే చూసేశారు. సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ లో నడిచింది.
Read Also : Bobby : బాలీవుడ్ బడా హీరోతో డైరెక్టర్ బాబీ మూవీ..?
మీమ్స్, ట్రోలర్స్ అందరూ ఈ షాట్ ను తమకు కావాల్సినట్టు వాడేస్తున్నారు. అయితే ఈ షాట్ ను ప్రత్యేకించి ఈ టైమ్ లో రివీల్ చేయడం వెనక బుచ్చిబాబు మార్క్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దేశమంతా అటువైపే ఉంది. కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిని మూవీ మీదకు తీసుకొచ్చేందుకు బుచ్చిబాబు ప్రత్యేకించి ఇదే టైమ్ లో ఆ క్రికెట్ షాట్ ను కావాలనే రివీల్ చేశాడంట. ఆయన ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ షాట్ ను ఐపీఎల్ క్రికెట్ టీమ్స్ కు తగ్గట్టు వాడేసుకుంటూ వీడియోలు, రీల్స్ చేసేస్తున్నారు. దెబ్బకు పెద్ది మూవీకి కావాల్సినంత బజ్ క్రియేట్ అయిపోతోంది.