Priyanka Chopra: అమెరికా చెక్కేసిన ప్రియాంకకి ఇక్కడ ఎన్ని లక్షలు అద్దెలు వస్తాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Chopra Family Rents Out Pune Bungalow: ప్రియాంక చోప్రా 2018లో నిక్ జోనాస్‌తో వివాహమైనప్పటి నుంచి న్యూయార్క్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఏదైనా షూటింగ్ ఉంటే లేదా కుటుంబం, స్నేహితులను కలవడానికి ముంబైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా నటి ప్రియాంక చోప్రా పూణేలోని తన బంగ్లాను అద్దెకు ఇచ్చింది. ఆమె దాని నుండి ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ప్రియాంక కుటుంబం నుంచి ఈ బంగ్లాను ‘ది అర్బన్ నోమాడ్స్ కమ్యూనిటీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు నెలకు రూ. 2 లక్షలకు అద్దెకు తీసుకుంది. నటి తల్లి మధు చోప్రా, సోదరుడు సిద్ధార్థ్ ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదిక ప్రకారం మధు చోప్రా మరియు సిద్ధార్థ్ మార్చి 21 న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ బంగ్లా కోసం ఆ సంస్థ ప్రియాంక కుటుంబానికి 6 లక్షల రూపాయల డిపాజిట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ప్రతినెలా రూ.2.06 లక్షల అద్దె కూడా చెల్లిస్తుంది.
Pithapuram: బాబాయ్ కోసం అబ్బాయ్.. పిఠాపురంలో మెగా హీరో ప్రచారం!
Also Read
ప్రియాంక చోప్రా యొక్క ఈ బంగ్లా పూణేలోని కోరేగావ్ పార్క్‌లో ఉంది. ఈ ప్లాట్ పరిమాణం 3754 చదరపు అడుగులు, గ్రౌండ్ ఫ్లోర్ 2180 చదరపు అడుగులు, బేస్‌మెంట్ ప్రాంతం 950 చదరపు అడుగులు. గార్డెన్ ప్రాంతం 2232 చదరపు అడుగులు. అదే సమయంలో, పార్కింగ్ ప్రాంతం 400 చదరపు అడుగులు. 2023లో ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనాస్ ఓషివారాలోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న తమ రెండు పెంట్‌హౌస్‌లను రూ.6 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. గతంలో ప్రియాంక చోప్రా లోఖండ్‌వాలాలోని తన కమర్షియల్ ప్రాపర్టీని రూ.7 కోట్లకు విక్రయించింది. జూన్ 2021లో, ప్రియాంక చోప్రా ఓషివాడలోని అంధేరి-వెస్ట్ ప్రాంతంలో 2,040 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనంలో కార్యాలయం కోసం రెండవ అంతస్తును రూ. 2.11 లక్షలకు తీసుకుంది. ఇక ఆమెకు ఈ లెక్కన అద్దెల ద్వారానే లక్షల రూపాయలు లభిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక సినిమాల గురించి చెప్పాలంటే ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం హెడ్స్ ఆఫ్ స్టేట్ షూటింగ్‌లో ఉంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!