Priyamani: టాలీవుడ్ లో హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకున్న ఆమె తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అమ్మడు తగ్గేదే లేదు అన్నట్లు వరుస అవకాశాలను అందుకొంటుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ల స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చింది. హీరోయిన్లు అంటే పైకి కనిపించేంత హ్యాపీగా ఉండరని, వారు అనుభవించే కష్టాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇష్టం లేకున్నా కొన్ని పాత్రలు చేయాల్సి వస్తుందని తెలిపింది. అంతేకాకుండా అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పుకొచ్చింది.
“నేను ఒక సినిమా చేసేటప్పుడు కథ మొత్తం వింటాను. అందులో డ్రెస్ ఏం వేసుకోవాలి.. స్కిన్ షో ఉంటుందా అన్ని చూస్తాను. అయితే ఒక సినిమా చేస్తున్నప్పుడు నిర్మాత నా దగ్గరకు వచ్చి.. ప్రియమణి ఈ సీన్ లో నీ బొడ్డుపై ఒక టాటూ ఉండాలి. ఆ టాటూతో నీ బొడ్డును చూపించాలి అని చెప్పారు. అది నేను కథ చదివినప్పుడు లేదు కదా అని అంటే.. ఖచ్చితంగా చేయాలంటూ టార్చర్ పెట్టాడు. డబ్బు తీసుకున్నాకా చేసేదేం లేదు కాబట్టి అలాగే చేశాను. సినిమా తారల జీవితం బావుంటుందని అందరు అంటుంటారు.. కానీ హీరోయిన్లు చాలామంది, చాలా సార్లు తమకు నచ్చని పనులు కూడా చేయాల్సి వస్తుంది” అని అంటూ తన కెరీర్ లో ఎదుర్కున్న ఆటుపోట్లను ఏకరువు పెట్టింది. ప్రస్తుతం ప్రియా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.